ఆయన ఫోన్లో కూడా దొరకట్లేదంటగా?

Vijaya Sai Reddy Criticize Actor Shivaji Over TV9 Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  టీవీ9 రవి ప్రకాశ్‌, సీనీ నటుడు శివాజీపై వెఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా పలు విమర్శలు, వ్యంగోక్తులు చేశారు. విజిల్‌ బ్లోయర్స్‌ యాక్ట్‌, పీనల్‌ కోడ్‌ సెక్షన్ల గురించి ఉపన్యాసాలు దంచిన గరుడ పురాణం శివాజీ నాలుగు రోజులుగా ఎందుకు పరారీలో ఉన్నారని ప్రశ్నించారు. తన జాతకం తానకే తెలిసిపోవడంతో పరారీలో ఉంటున్నారని విమర్శించారు. ‘ రవి ప్రకాశ్‌ రక్షిస్తాడనుకుంటే ఆయనే రోడ్డునపడ్డాడు. ఫోన్లో కూడా దొరకట్లేదంటగా’ అంటూ వరుస ట్వీట్లతో శివాజీపై విమర్శనాస్త్రాలు సంధించారు. 

చదవండి : తెల్లకాగితం మీద అగ్రిమెంట్‌ రాసుకోవడమేంటో?

టీవీ 9 వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారని నమోదైన కేసు వ్యవహారంలో శుక్రవారం విచారణకు హాజరు కావాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు టీవీ 9 మాజీ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎంకేవీఎన్‌ మూర్తి, రవి ప్రకాశ్‌, శివాజీలకు నోటీసులు అందించారు. వీరిలో ఎంకేవీఎన్‌ మూర్తి విచారణకు హాజరుకాగా.. రవిప్రకాశ్‌, శివాజీ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top