తెల్లకాగితం మీద అగ్రిమెంట్‌ రాసుకోవడమేంటో?

Vijayasai Reddy Criticize TV9 Ravi Prakash And Shivaji - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా మరోసారి టీవీ9 రవిప్రకాశ్‌, టాలీవుడ్‌ నటుడు శివాజీ విమర్శనాస్త్రాలు సంధించారు. రవిప్రకాశ్‌ తనకు టీవీ9 షేర్లు అమ్మి బదిలీ చేయడం లేదని కంపెనీస్‌ లా ట్రిబ్యునల్‌కు శివాజీ ఫిర్యాదు చేసింది నిజమైతే.. చీటింగ్‌ కేసుగా పరిగణించి ఆ ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. ‘ రవి ప్రకాశ్‌ తనకు టీవీ9 షేర్లు అమ్మి బదిలీ చేయడం లేదని గరుడ పురాణం శొంటినేని శివాజీ కంపెనీస్‌ లా ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశాడంటున్నారు. ఇది చీటింగ్‌ కేసు అవుతుంది. ట్రిబ్యునల్‌ ఆ ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. అయినా తెల్ల కాగితం మీద షేర్ల అమ్మకం అగ్రిమెంట్‌ రాసుకోవడమేంటో?’ అని విజయసాయి రెడ్డి ట్విట్‌ చేశారు. 

వాళ్ల కోసం బాబు నానా తంటాలు పడుతున్నారు
ప్రజలంతా మనవైపే.. విజయం మనదే అంటూ ఢీలా పడ్డ నేతలను గాలికొట్టి లేపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానా తంటాలు పడుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ నేతలకు ధైర్యాన్ని నూరిపోస్తునే మరోవైపు తన కోటరీలో ఉన్న కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లులను చకచక క్లియర్‌ చేయించుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఈ నెల 23న( ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు) రిటర్న్‌ టికెట్‌ బుక్‌ చేసుకొని..తమ్ముళ్లకు మాత్రం ధైర్యం నూరిపోస్తున్నారని ట్విటర్‌ వేదికగా ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top