ఓయూతో కేసీఆర్‌కు అవసరం తీరింది: వీహెచ్‌ | v hanumantha rao fires on cm kcr | Sakshi
Sakshi News home page

ఓయూతో కేసీఆర్‌కు అవసరం తీరింది: వీహెచ్‌

Jun 12 2017 2:36 PM | Updated on Sep 19 2019 8:28 PM

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు మండిపడ్డారు.

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి విద్యార్థులను వినియోగించు‍కున్న కేసీఆర్‌, ఇప్పుడు విస్మరిస్తున్నారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీతో కేసీఆర్‌కు అవసరం తీరిందని.. అం‍దుకే అక్కడ మీటింగులు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుమంతరావు అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అసలు రాష్ట్రానికి గవర్నర్‌ ఎందుకున్నాడో అర్ధం కావడం లేదు. రైతులకు సంకెళ్లు వేసినా.. చచ్చినా ఆయనకు పట్టడం లేదని మండిపడ్డారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement