గుర్తుతెలియని యువకుడి దారుణ హత్య | unknown Youngster brutal killing in hyderabad | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని యువకుడి దారుణ హత్య

May 1 2015 10:26 PM | Updated on Sep 4 2018 5:16 PM

బొల్లారంలోని జనప్రియ అపార్ట్‌మెంటు వద్ద రైల్వే బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

హైదరాబాద్(బొల్లారం): బొల్లారంలోని జనప్రియ అపార్ట్‌మెంటు వద్ద రైల్వే బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం రైల్వే బ్రిడ్జి సమీపంలోని చెట్ల పొదలలో శుక్రవారం శవాన్ని చూసిన స్థానికులు బొల్లారం పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీస్ జాగిలాలు సంఘటనా స్థలం నుంచిగ్ నేరుగా మచ్చ బొల్లారంలోని శృతి వైన్స్ వెనుక భాగంలోగల సిట్టింగ్ రూం వద్దకు వెళ్లాయి. సిట్టంగ్ రూంలో గల సిసి కెమరా పుటేజ్ ఆదారంగా మృతుని వివరాలు సేకరించెందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

 

ముఖం బాగంతోపాటు అక్కడక్కడ గాయలుండడంతో హత్యగా నిర్దరణకు వచ్చినట్లు తెలిపారు. అయితే తాగి వచ్చిన తర్వాత హత్య జరిగిందా లేదా హత్య అనంతరం వైన్స్ కు  వెళ్ళారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement