కల్వర్ట్‌ కింద గుర్తు తెలియని  మృతదేహం లభ్యం | unidentified dead body found in medak | Sakshi
Sakshi News home page

Feb 14 2018 3:24 PM | Updated on Feb 14 2018 3:24 PM

unidentified dead body found in medak - Sakshi

చిలప్‌చెడ్‌ శివారులో కల్వర్టు కింద సంచిలో ఉన్న మృతదేహం

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): చిలప్‌చెడ్‌ గ్రామ శివారులోని కల్వర్ట్‌ కింద సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు నర్సాపూర్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా మంగళవారం సీఐ తెలిపిన వివరాల ప్రకారం చిలప్‌చెడ్‌ శివారులోని జోగిపేట్‌ – నర్సాపూర్‌ ప్రధాన రహదారి పక్కనే ఉన్న కల్వర్టు కింద మృతదేహం లభ్యమైందని, ముందుగా పశువులు కాసే వారు దాన్ని గుర్తించారన్నారు. మృతదేహాన్ని సంచిలో కట్టి అక్కడ పడేశారన్నారు. మృతదేహం వద్ద దుర్గంధం ఎక్కువగా రావడంతో బుధవారం ఉదయం వెలికి తీసి వివరాలు సేకరించి, దర్యాప్తు ప్రారంభిస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement