breaking news
narsapur police
-
కల్వర్ట్ కింద గుర్తు తెలియని మృతదేహం లభ్యం
చిలప్‌చెడ్(నర్సాపూర్): చిలప్‌చెడ్ గ్రామ శివారులోని కల్వర్ట్ కింద సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు నర్సాపూర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సీఐ తెలిపిన వివరాల ప్రకారం చిలప్‌చెడ్ శివారులోని జోగిపేట్ – నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న కల్వర్టు కింద మృతదేహం లభ్యమైందని, ముందుగా పశువులు కాసే వారు దాన్ని గుర్తించారన్నారు. మృతదేహాన్ని సంచిలో కట్టి అక్కడ పడేశారన్నారు. మృతదేహం వద్ద దుర్గంధం ఎక్కువగా రావడంతో బుధవారం ఉదయం వెలికి తీసి వివరాలు సేకరించి, దర్యాప్తు ప్రారంభిస్తామన్నారు. -
మరో రిపోర్టర్ బ్లాక్ మెయిలింగ్... కేసు నమోదు
ఏలూరు: ప్రముఖ టీవీ చానల్లో క్రైమ్ రిపోర్టర్ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం... కేసు నమోదు మరిచిపోకముందే... అదే జిల్లాలో మరో టీవీ రిపోర్టర్‌పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... నర్సాపురం సమీపంలోని లక్ష్మణేశ్వర గ్రామానికి చెందిన ఆదిబాబు అనే వ్యక్తిని ఓ టీవీలో రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వేండ్ర శ్రీనివాసరావు బెదిరించి భారీగా నగదు డిమాండ్ చేస్తున్నాడు. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దాంతో ఆదిబాబు మిన్నకుండ పోయాడు. అయితే ఇటీవల కాలంలో రిపోర్టర్ వేధింపులు ఆదిబాబుపై అధికమయ్యాయి. దీంతో బాధితుడు ఆదివారం నర్సాపురం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వేండ్ర శ్రీనివాసరావుపై 341, 290, 323, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రముఖ టీవీ చానల్లో క్రైం రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ రిపోర్టర్ పశ్చిమగోదావరి జిల్లాలో ఓ విద్యా సంస్థ నుంచి భారీగా నగదు డిమాండ్ చేసి .... రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు దొరికిపోయిన సంగతి తెలిసిందే.