చెరువులో మృతదేహం లభ్యం | Unidentified dead body found in Pond | Sakshi
Sakshi News home page

చెరువులో మృతదేహం లభ్యం

Aug 16 2015 11:48 AM | Updated on Sep 17 2018 8:02 PM

ఓ వ్యక్తిని దుండగులు హత్య చేసి చెరువులో పడేశారు.

నర్సింహుల పేట (వరంగల్) : ఓ వ్యక్తిని దుండగులు హత్య చేసి చెరువులో పడేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సింహుల పేటలో ఆదివారం వెలుగు చూసింది. మండలంలోని కుమరికుంట్ల గ్రామ శివారులోని చెరువులో ఓ వ్యక్తి(40)ని దుండగులు హత్య చేసి పడేశారు.

ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా మృతుడి వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement