జిల్లాకు పెళ్లికళ | two thousands marriages are done | Sakshi
Sakshi News home page

జిల్లాకు పెళ్లికళ

Jun 22 2014 2:03 AM | Updated on Sep 2 2017 9:10 AM

జిల్లాకు పెళ్లికళ

జిల్లాకు పెళ్లికళ

జిల్లాలో ఆదివారం ద్వాదశి రోజున దాదాపు రెండువేలకుపైగా జంటలు వివాహబంధంతో ఒక్కటవుతున్నాయి. ఈ ఏడాది చైత్రమాసంలో(ఏప్రిల్ 30 నుంచి) శుభ కార్యాలు ప్రారంభమయ్యాయి.

నిజామాబాద్ కల్చరల్ : జిల్లాలో ఆదివారం ద్వాదశి రోజున దాదాపు రెండువేలకుపైగా జంటలు వివాహబంధంతో ఒక్కటవుతున్నాయి. ఈ ఏడాది చైత్రమాసంలో(ఏప్రిల్ 30 నుంచి) శుభ కార్యాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి జూన్ 22వరకు శుభతిథులు ఉండటంతో వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపారాల ప్రారంభోత్సవాలు జోరుగా సాగాయి. ఆదివారంతో శుభముహూర్తాలు ముగియనున్నాయి.  చివరిరోజున జిల్లావ్యాప్తంగా రెండువేల వరకు వివాహాలు జరుగనున్నట్లు వేదపండితులు మధుసూదనశర్మ, పురోహితులు చిరంజీవాచార్యులు తెలిపారు.

 జూన్ 23నుంచి ఆగస్టు 8వర కు మూడాలున్నట్లు వారు పేర్కొన్నారు. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్  వరకు శుభముహుర్తాలు లేవని చెప్పారు. డిసెంబర్‌లో కూడా కొన్ని మంచిదినాలే ఉన్నాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే శుభకార్యాలు ప్రారంభమవుతాయని వారు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement