ఊడిపడ్డ పాఠశాల పైకప్పు | Sakshi
Sakshi News home page

ఊడిపడ్డ పాఠశాల పైకప్పు

Published Thu, Dec 11 2014 12:09 AM

ఊడిపడ్డ పాఠశాల పైకప్పు - Sakshi

నారాయణఖేడ్ రూరల్ : పాఠశాల పైకప్పు పె చ్చులూడి ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని చాప్టా (కే) ఉన్న త పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. చాప్టా(కే) ఉన్నత పాఠశాల ఉదయం పాఠశాల సమయానికి విద్యార్థులు పాఠశాలకు చేరుకున్నారు. 9వ తరగతి గదిలోకి ఐదారుగురు విద్యార్థులు వెళ్లగానే ఒక్కమారిగా పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. గదిలో కూర్చున్న హంగిర్గా (కే) గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని లావణ్య (14) తలపై పెచ్చులు పడడంతో తలపగిలింది. అదేవిధం గా చాప్టా (కే) గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని సుమిత్ర (14)కు చేయికి స్వల్ప గాయాలు తగిలాయి.

పైకప్పులు ఇంకాస్త ఆలస్యంగా ఊడిపడి ఉంటే చాలామంది విద్యార్థులు గాయపడేవారని ఉపాధ్యాయులు చెప్పా రు. పాఠశాల ప్రారంభంకాగానే పెచ్చులు ఊడిపడడంతో ఇద్దరు గాయాలతో బయటపడ్డారని చెప్పారు. కాగా పాఠశాలను ఆర్వీఎం నిధులతో 2012-13వ సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించగా ఆరునెలల క్రితమే భవనం నిర్మాణం పనులు పూర్తయి పాఠశాల కొనసాగుతుంది. పాఠశాల పైకప్పుకు గిలావ్ (సిమెంట్ పూత) వేసే ముందు కచ్చులు కొట్టకపోవడంతోనే కూ లిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ప్రమా దం అనంతరం  విద్యార్థులను ఆరుబయట కూర్చోబెట్టి పాఠశాలు బోధించారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ భీంసింగ్ పాఠశాలను సందర్శించి ప్రమాద సంఘటన వివరాలను ఉపాధ్యాయులను అడగి తెలుసుకున్నారు.

విద్యార్థి సంఘాల ఆందోళన : ప్రమాదం విష యం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నా యకులు గ్రామానికి వెళ్లి విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ, కేవీపీఎస్, సీపీఎం, టీఎన్‌ఎస్‌ఎఫ్ సంఘాల నాయకు లు ప్రవీణ్, నరసింహులు, చిరంజీవి, అర్జున్, అశోక్‌రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి గ్రామంలోని రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నాసిరకంగా భవనం నిర్మించడం వల్లే  ప్రమాదం చోటుచేసుకుందన్నారు. భవనం నాసిరకం నిర్మాణానికి కారణమైన ఆర్వీఎం ఏఈ, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement