టీఎస్‌పీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు | Two notifications from TSPSC | Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు

Jul 20 2018 3:01 AM | Updated on Jul 20 2018 3:01 AM

Two notifications from TSPSC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ గురువారం రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీలో 124 బిల్‌కలెక్టర్, బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో 76 పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది.

ఈ పోస్టులకు గ్రూప్‌–4, ఆర్టీసీ పోస్టులతో పాటే కామన్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. వయోపరిమితి, విద్యార్హత తదితర వివరాలు దరఖాస్తుల తేదీ నాటికి వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పేర్కొంది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో 78 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని భావించినా, రెండు పోస్టులపై స్పష్టత రానందునా 76 పోస్టులకే నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement