‘‘తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదు.. తుప్పుపట్టిన సిద్ధాంతాలు అవలంభిస్తున్న మావోయిస్టు పార్టీలో ఉన్న వారికి
లొంగిపోవడమా.. చావడమా: ఎస్పీ భాస్కరన్
చిట్యాల: ‘‘తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదు.. తుప్పుపట్టిన సిద్ధాంతాలు అవలంభిస్తున్న మావోయిస్టు పార్టీలో ఉన్న వారికి లొంగిపోవ డమా.. లేదా చనిపోవడమా అనే మార్గాలే ఉన్నాయని’’జయశంకర్ భూపాల పల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్ అన్నారు.
జిల్లాలోని చిట్యాల పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని అందుగుతండాలో రెండు మండలాలకు చెందిన ప్రజల కోసం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న గాజర్ల రవి అలియాస్ గణేష్ లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు.