ఆటో బోల్తా: ఇద్దరు మృతి | two killed in auto accident in warangal district | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: ఇద్దరు మృతి

Aug 20 2014 10:35 AM | Updated on Aug 25 2018 5:41 PM

వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం ముత్యాలమ్మగూడెం వద్ద బుధవారం ఆటో బోల్తా పడింది.

వరంగల్: వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం ముత్యాలమ్మగూడెం వద్ద బుధవారం ఆటో బోల్తా పడింది. ఆ ఘటనలో ఆటోలో ప్రయాణిసున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. దాంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రలలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకోవడమే కాకుండా... అతి వేగమే ఆ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement