వేటు పడింది! 

Two Election Officers Suspended In Panchayat Elections First Phase - Sakshi

సాక్షిప్రతినిధి, సూర్యాపేట : మొదటి విడత పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులపై వేటు పడింది. కౌంటింగ్‌ ముగిసిన తర్వాత కొన్ని బ్యాలెట్‌ పత్రాలను భద్రపరిచేందుకు తీసుకెళ్లనందుకు సస్పెండ్‌ అయ్యారు. జిల్లా పంచాయతీ ఉప ఎన్నికల అధికారి, ఆర్డీఓ మోహన్‌రావు ఇచ్చి న నివేదిక ఆధారంగా చివ్వెంల మండలం గుంజలూరు స్టేజ్‌ –2 అధికారి బుచ్చిరెడ్డి, మోతె మండలం హుస్సేన్‌ బాద్‌ స్టేజ్‌ –2 అధికారి ఖాజాఖలీల్‌ఖాన్‌ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
 
అసలు ఏం జరిగిందంటే..
ఈనెల 21న గుంజలూరు, హుస్సేన్‌బాద్‌ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అయితే కౌంటింగ్‌ అయిన బ్యాలెట్‌ పత్రాలు కొన్ని గుంజలూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చెల్లాచెదురుగా పడి ఉన్న సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సర్పంచ్‌ బరిలో నిల్చొని ఓటమిపాలైన అభ్యర్థితో పాటు, ఆయనకు మద్దతుగా గ్రామస్తులు ఈ విషయమై ఆందోళన వ్యక్తంచేశారు. గరిడేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా ఉన్న వై.బుచ్చిరెడ్డి ఇక్కడ స్టేజ్‌ –2 అధికారిగా విధులు నిర్వర్తించారు.

విధుల్లో నిర్లక్ష్యంవహించి కొన్ని బ్యాలెట్‌ పత్రాలను భద్రపర్చలేదని విచారణలో తేలింది. దీంతో అతనిపై కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. అలాగే మోతె మండలం హుస్సేన్‌బాద్‌లోకొన్ని బ్యాలెట్‌ పేపర్లు పాఠశాల లోని చెత్తకుప్పలో దర్శనమివ్వడంతో ఓటమిపాలై న అభ్యర్థి ఈ విషయాన్ని ఎన్నికల అ ధికారి దృష్టి కి తీసుకొచ్చారు. దీనిపై విచారణ చేసిన అధికారు లు స్టేజ్‌ –2 అధికారి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని నిర్దారణకు వచ్చారు. అధికారి ఇచ్చిన నివేదికతో కలెక్టర్‌ ఇక్కడ స్టేజ్‌–2 అధికారిగా విధులు నిర్వహించిన దురాజ్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాజాఖలీల్‌ఖాన్‌ను సస్పెండ్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top