రోడ్డు దాటుతున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని వేగంగా వచ్చిన కారు ఢీకొని ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది.
హైదరాబాద్ : రోడ్డు దాటుతున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని వేగంగా వచ్చిన కారు ఢీకొని ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. వనస్థలిపురంలోని ఇంజాపూర్ వద్ద సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఒకే కుటుంబానికి చెందినవారిని అదుపు తప్పిన కారు ఢీకొనటంతో తండ్రి రాగయ్య, కూతురు సింధు(12) అక్కడికక్కడే చనిపోయారు. తల్లి మంగమ్మ, కొడుకు అజయ్(7)లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.