రెండు బైక్‌లు ఢీ.. ఐదుగురికి గాయాలు | two bikes collide five injured in adilabad district | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ.. ఐదుగురికి గాయాలు

Jan 8 2016 11:40 PM | Updated on Aug 25 2018 6:22 PM

ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఖానాపూర్ మండలం మందపల్లి, నాగాపూర్ గ్రామాల మధ్య రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో పోశన్న, లక్ష్మి దంపతులు, వారి కుమారుడు రవితేజతోపాటు వేరొక బైక్‌పై ప్రయాణిస్తున్న అరికెల లక్ష్మణ్, చెప్పాల భూమేశ్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement