నంబర్‌ ఒక్కటే ... వాహనాలే రెండు! | Two Bike Same Registration Number In Warangal | Sakshi
Sakshi News home page

నంబర్‌ ఒక్కటే ... వాహనాలే రెండు!

Aug 29 2019 10:58 AM | Updated on Aug 29 2019 10:59 AM

Two Bike Same Registration Number In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: వాహనాన్ని రిజిస్టేషన్‌ చేయించుకోకుండా మరో వాహనం నంబర్‌ వేసుకోని అడ్డంగా దొరికిపోయిన సంఘటన హన్మకొండ పోలీసు స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. హన్మకొండ కిషన్‌పురకు చెందిన సృజన్‌కుమార్‌ 2014లో ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. వాహనాన్ని రిజిస్టేషన్‌ చేయించుకోకుండా తన వద్ద పనిచేసే యువకుడికి అప్పగించాడు. సదరు వ్యక్తి కూడా దానిని రిజిస్టేషన్‌ చేయించకుండా తన స్నేహితుడికి తెలియకుండా అతడి బండి నంబర్‌ వేసుకోని నడుపుతున్నాడు.

ఇటీవల కాలంలో ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు రేగొండకు చెందిన ప్రశాంత్‌ ఫోన్‌ వచ్చింది. దీంతో తాను ఎక్కడ కూడా నిబంధనలను ఉల్లంఘించలేదని, జరిమానాలు ఎందుకు వస్తున్నాయని ప్రశాంత్‌ హన్మకొండ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన ఎస్సై లక్కసీ కొంరెళ్లి ఒకే నంబర్‌తో నడుస్తున్న రెండు వాహనాలను పట్టుకున్నారు. వాహనాన్ని సకాలంలో రిజిస్టేషన్‌ చేయించుకోకుండా నిర్లక్ష్యం వహించినందుకు సృజన్‌కుమార్‌పై, తన స్నేహితుడి బండి నంబర్‌ను వేసుకోని వాహనాన్ని వాడుకుంటూ నిబంధనలు అతిక్రమించినందుకు సత్యనారాయణపై చీటింగ్‌ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైన ఇటువంటి మోసలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement