
'తుమ్మలను అవమానించారు'
టీడీపీని తుమ్మల నాగేశ్వరరావు వీడితే తామంతా ఆయన వెంటే ఉంటామని డీసీసీబీ చైర్మన్ మొవ్వా విజయబాబు తెలిపారు.
ఖమ్మం: టీడీపీని తుమ్మల నాగేశ్వరరావు వీడితే తామంతా ఆయన వెంటే ఉంటామని డీసీసీబీ చైర్మన్ మొవ్వా విజయబాబు తెలిపారు. జెడ్మీ చైర్మన్, వైస్ చైర్మన్లతో సహా అందరూ ఆయన వెంటే ఉంటారని ఆయన చెప్పారు.
మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వైఖరి వల్లే జిల్లా టీడీపీలో సంక్షోభం వచ్చిందని విజయబాబు ఆరోపించారు. తుమ్మల నాగేశ్వరరావును అడుగడుగునా అవమానాలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విజయబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.