'అజాంఖాన్ కుటుంబాన్ని ఆదుకోవాలి' | TTDP Leaders takes on kcr Government | Sakshi
Sakshi News home page

'అజాంఖాన్ కుటుంబాన్ని ఆదుకోవాలి'

Oct 15 2014 12:25 PM | Updated on Sep 2 2017 2:54 PM

సంక్షేమ పథకాలు అమలులో అర్హులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని టీడీపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

హైదరాబాద్: సంక్షేమ పథకాలు అమలులో అర్హులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని టీడీపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు తమ వివరాలు ఇస్తున్నారు... ఇప్పుడేమో దరఖాస్తులంటూ ప్రజలకు సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దరఖాస్తులు ఇచ్చేందుకు వెళ్లి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.

మంగళవారం తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన అజంఖాన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సైదాబాద్ మండల పరిధిలోని స్వామి వివేకానంద స్కూల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోడానికి వచ్చిన సపోటాబాగ్‌కు చెందిన ఆజమ్‌ఖాన్(65) క్యూలోనే స్పృహ తప్పి పడిపోయి మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement