అశ్వత్థామరెడ్డి సెలవు వినతి తిరస్కృతి

TSRTC Rejected Ashwathama Reddy's Six Months Leave Letter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సమ్మె ముగిసిన అనంతరం విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి.. ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవులు కావాలంటూ దాఖలు చేసిన అభ్యర్థనను ఆర్టీసీ తిరస్కరించింది. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, సంస్థ ఉన్నతికి సిబ్బంది అంతా కలసి శ్రమించాల్సిన అవసరం ఉందని, ఈ సమయంలో సెలవు మంజూరు చేయలేమంటూ అధికారులు అప్పట్లోనే స్పష్టం చేశారు. తాజాగా ఆయన మరోసారి ఎక్స్‌ట్రా ఆర్టనరీ లీవ్‌ (ఈఓఎల్‌) కోసం దరఖాస్తు చేయగా రెండోసారి తిరస్కరించారు. సంస్థ కష్టాల్లో ఉన్నందున అన్ని రోజులు సెలవు మంజూరు చేయలేమని, వెంటనే విధుల్లో చేరాలని అధికారులు సూచించారు.

చదవండి:

కార్మిక సంఘాల ఏర్పాటు ప్రజాస్వామిక హక్కు: అశ్వత్థామరెడ్డి

సీఎం ఆదేశాలు అమలు కావట్లేదు : అశ్వత్థామ రెడ్డి

దీర్ఘకాలిక సెలవులో అశ్వత్థామరెడ్డి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top