సీఎం ఆదేశాలు అమలు కావట్లేదు : అశ్వత్థామ రెడ్డి

సాక్షి, హైదరాబాద్ : ప్రజాస్వామ్య దేశంలో డిపోల్లో రెండేళ్ల వరకు ఎన్నికలు వద్దంటూ సంతకాలు చేయించడం సరికాదంటూ అశ్వత్థామ రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ తరపున ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల డ్యూటీల విషయంలో సీఎం ఆదేశాలను అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కొన్ని బస్సులను రద్దు చేస్తున్నారని, సమ్మె కాలంలో కొందరు అధికారులు చేసిన నిధుల దుర్వినియోగంపై ఏసీబీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొందరు అధికారుల కోసమే రిటైర్మెంట్ వయసు పెంచారని, ప్రస్తుతం ఏ ఒక్క కార్మికుడు కూడా తృప్తిగా పని చేయడం లేదన్నారు. లేబర్ కమిషన్ చెప్పినా మా సంఘాలు వద్దని చెబుతున్నారని, ఆర్టీసీలో యూనియన్లను గుర్తించాలని కోరారు. ఎన్నికలు జరిగేవరకు ప్రస్తుత గుర్తింపు సంఘాలను గుర్తించాలి. లేదంటే న్యాయపోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి