‘అప్పుడిలా చేసుంటే.. కేసీఆర్‌ సీఎం అయ్యేవాడా’ | TS RTC Strike Motkupalli Narasimhulu Fires On KCR | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు.. కేసీఆర్‌ గద్దె దిగాలి: మోత్కుపల్లి

Oct 19 2019 9:31 AM | Updated on Oct 19 2019 10:44 AM

TS RTC Strike Motkupalli Narasimhulu Fires On KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు పూర్తి మద్దతిస్తున్నట్లు మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రానికి తండ్రి లాంటి వారని.. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికైనా సీఎం గద్దె దిగి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాల్సింది పోయి.. వారిని ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో హై కోర్టు చురకలంటించినా.. కేసీఆర్‌ తీరు మారకపోవడం బాధకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్‌ చర్యలను గమనిస్తుందని.. అదును చూసి ఆయన పని పడుతుందని మోత్కుపల్లి హెచ్చరించారు.

గవర్నర్‌ ఆర్టీసీ సమ్మెపై ఆరా తీస్తున్నారంటే.. కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బంది మొదలయినట్లే అని తెలిపారు మోత్కుపల్లి. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను కూడా ఇలానే ఇబ్బంది పెట్టి ఉంటే.. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. పరిస్థితులు చేయి దాటకముందే.. మేల్కొంటే మంచిదని సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మంచి పని చేశారని ప్రశంసించారు మోత్కుపల్లి.
(చదవండి: ఆర్టీసీని నాకివ్వండి.. లాభాల్లో నడిపిస్తా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement