వైద్య శాఖలో 4,540 పోస్టులు | TS Government Sanctions 4,540 new posts for Hospitals | Sakshi
Sakshi News home page

వైద్య శాఖలో 4,540 పోస్టులు

Oct 22 2017 2:02 AM | Updated on Aug 15 2018 8:12 PM

TS Government  Sanctions 4,540 new posts for Hospitals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్‌ కింద ఉన్న ఆసుపత్రులకు ప్రభుత్వం కొత్తగా 4,540 పోస్టులు మంజూరు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ఆమోదం తెలిపారు. ప్రస్తుతం వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఏరియా ఆసుపత్రుల్లో కొత్తగా 3,900 పోస్టులు అవసరం కాగా, అప్‌గ్రేడ్‌ చేసిన 13 ఏరియా ఆసుపత్రుల్లో మరో 640 పోస్టులు అవసరమని అధికారులు సీఎంకు నివేదించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందిని పెంచాల్సి ఉన్నందున వెంటనే ఈ నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement