టీఆర్‌ఎస్‌ శక్తివంతమైన పార్టీ  | TRS is A Power Full Party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ శక్తివంతమైన పార్టీ 

Apr 8 2019 2:39 PM | Updated on Apr 8 2019 2:39 PM

TRS is A Power Full Party - Sakshi

మంచిర్యాల టౌన్‌: హమాలీవాడలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

దండేపల్లి: టీఆర్‌ఎస్‌ శక్తివంతమైన పార్టీ, అందరి చూపు టీఆర్‌ఎస్‌ వైపే ఉందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. మండలంలోని లింగాపూర్‌లో సర్పంచ్‌ అజ్మేర సుగుణ, పలువురు, తాళ్లపేటకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండు వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ చేప డుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రైతు సమితి జిల్లా కన్వీనర్‌ గురువయ్య, వైస్‌ ఎంపీపీ రాజేందర్, మండల అధ్యక్ష, కార్యదర్శులు మల్లేష్, శ్రీనివాస్, నాయకులు లింగ య్య, అంజయ్య, తిరుపతి, దేవయ్య, రవి, తదిత రులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి.. 

పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్‌నేతను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కోరారు. ఆదివారం పట్టణంలోని 26, 27 వార్డులలో పాత మంచిర్యాల, రంగంపేట్‌లలో ఎన్నికల ప్రచారా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం 7, 8, 9, 10 వార్డులలో ఇంటింటాæ ప్ర చారం నిర్వహించారు. 32 వార్డులో నడిపెల్లి విజిత్‌కుమార్‌ ప్రచారం చేశారు. మున్సిపల్‌ వైస్‌ చై ర్మన్‌ నల్ల శంకర్, టీఆర్‌ఎస్‌ నాయకులు గోగుల రవీదర్‌రెడ్డి, కౌన్సిలర్‌ దబ్బెటి శ్రీనివాస్, కౌన్సిలర్‌ బగ్గని రవి, జగన్మోహన్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement