రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న టీఆర్‌ఎస్‌ | TRS defying the Constitution | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న టీఆర్‌ఎస్‌

Published Tue, Dec 27 2016 2:41 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

TRS defying the Constitution

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌

సాక్షి, హైదరాబాద్‌: పేద ప్రజల భూము లను రక్షించాల్సిన ప్రభుత్వమే భూ భక్షక ప్రభుత్వంగా మారిందని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ భూసేకరణ చేస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గర సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఫార్మాసిటీ కోసం భూ సేకరణను రాజ్యాంగబద్ధంగా చేస్తు న్నామని మంత్రి కేటీఆర్‌ సభలో చెప్పి నా... క్షేత్ర స్థాయిలో రాజ్యాంగాన్ని ఉల్లం ఘిస్తున్నారన్నారు.

జీఓ 45పై హైకోర్టు స్టే ఉందని, జీఓ 123 రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్‌ సురేష్‌కుమార్‌ ఖేత్‌ పేర్కొన్నారని గుర్తుచేశారు. భూసేకరణచట్టం 2013 ప్రకారం పట్టాభూములకు, అసైన్డ్‌ భూములకు సమాన పరిహారం ఇవ్వాల న్నారు. గ్రామసభ తీర్మానం, సామాజిక సర్వే, 80 శాతం అంగీకారం ఉంటేనే భూసేకరణ చేయాలని చట్టం చెబుతు న్నదని వంశీచంద్‌ వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement