టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలి

TRS Candidate N narsaiah Canvass In Tripuraram - Sakshi

     టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య 

సాక్షి,త్రిపురారం : వచ్చేఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు.మంగళవారం అనుముల మండలంలోని అనుములవారిగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా అనుములవారిగూడెంకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు నోముల నర్సింహయ్య సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్‌ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరు కుంటున్నారన్నారు. గత ఏడు పర్యాయాలు సాగర్‌ నియోజకవర్గాన్ని పాలించిన జానారెడ్డి నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించాడన్నారు. నియోజకవర్గంలో జానారెడ్డి చేసిన అభివృద్ధి  శూన్యమన్నారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని ఓడించి టీఆర్‌ఎస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ యడవెల్లి విజయేందర్‌రెడ్డి,  మలిగిరెడ్డి లింగారెడ్డి, మండల అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, యనమల సత్యం, అల్లి పెద్దిరాజు, చల్లా మట్టారెడ్డి, వర్ర వెంకట్‌రెడ్డి, బిక్షం, పోషం శ్రీనివాస్‌గౌడ్, సురభి రాంబాబు, మాతంగి కాశయ్య, శేఖర్‌రాజు, నరేంద్రరావు, యాదగిరిగౌడ్, రావులపాటి ఎల్లయ్య, లింగయ్య, పురుషోత్తం ఉన్నారు. 
కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం:
తిరుమలగిరి :  కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ  సాధ్యమని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఎంసీ కోటిరెడ్డి అన్నారు. సోమవారం సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన యల్లాపురం కార్యకర్తలు ఒక్కరోజు వ్యవధిలోనే మంగళవారం తిరిగి ఎంసీ కోటిరెడ్డి సమక్షంలో సొంతగూటికి చేరారు. వీరితో పాటు చక్కోలంతండాకు చెందిన 20 కుటుంబాలు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎంసీ కోటిరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పేరుతో వచ్చే కాంగ్రెస్‌ నాయకులకు ప్రజలు ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెప్పాలన్నారు. నాగార్జునసాగర్‌ను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న జానారెడ్డి తన రాజకీయ జీవితంలో జానారెడ్డి ఏం అభివృద్ధి  చేశాడో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. మాయమాటలు చెబితే ప్రజలు ఓట్లేస్తారని జానారెడ్డి భావిస్తున్నారన్నారు. ప్రజలు ఆయన మాటలు  నమ్మే స్థితిలొ లేరన్నారు. నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ ఎన్నికల్లో జానారెడ్డికి ఓటమి తప్పదన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు శాం రాఘవరెడ్డి, కేతావత్‌ భిక్షా నాయక్, గుండెబోయిన అంజయ్య యాదవ్, భాషం వెంకటేశ్వర్లు, ఆవుల రామలింగయ్య, పసుపులేటి కృష్ణా, కేతపల్లి నాగయ్య, దున్న వెంకయ్య, శంకర్‌ నాయక్, మోతీలాల్, మురళి, దున్న ఉదయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top