అధికారదాహం కోసమే ప్రజాకూటమి : గొంగిడి సునీత

TRS Candidate Gongidi Sunitha Canvass In Atmakur - Sakshi

    టీఆర్‌ఎస్‌ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి 

సాక్షి, ఆత్మకూరు(ఎం) : అధికారం దాహం కోసమే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ ప్రజాకూటమిగా ఏర్పడ్డాయని టీఆర్‌ఎస్‌ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆత్మకూరు(ఎం) మండలం తుక్కాపురం, పోసానికుంట, రహీంఖాన్‌పేట, మోదుబావిగూడెం, కామునిగూడెంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ప్రజాకూటమిగా ఏర్పడిన నాయకులకు ప్రజా సంక్షేమం అవసరం లేదన్నారు. కేసీఆర్‌ను ఒంటరిగా ఓడించలేమని కాం గ్రెస్‌ పార్టీ నాలుగు పార్టీలను కలుపుకుని మాయా కూటమిగా ఏర్పడిందని ఎద్దేవా చేశారు. తెలం గాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించకోగలుగుతున్నామని చెప్పారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను, కుంటలను అభివృద్ధి చేసుకున్నామని, మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీటిని తీసుకొచ్చామని గుర్తుచేశారు. గ్రామీణ స్థాయిలో ప్రస్తుతం ప్రజలు లబ్ధిపొందే పథకాలను గతంలో ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో సాగునీటి కాల్వ ల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ రూ.300 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు.

సాగునీటి కా  ల్వలు పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీటిని అం దిస్తామని హామీ ఇచ్చారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి  చేయడానికి మీ ప్రతినిధిగా కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోమారు అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ సందర్భంగా మోదుబావిగూడెంలో కారు గుర్తుకు ఓటు వేస్తామని ప్రజలు తీర్మాణం చేశారు. రహీంఖాన్‌పేట, తుక్కాపురం, కామునిగూడెంలో వివిధ పార్టీల నుంచి 150 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది రమేష్‌గౌడ్, మండల అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, వైస్‌ ఎంపీపీ ఏనుగు దయాకర్‌రెడ్డి, రైతు సమితి జిల్లా సభ్యుడు కోరె భిక్షపతి, బీసు ధనలక్ష్మి, నాయకులు బీసు చందర్‌గౌడ్, యాస కవిత, మామిడి శ్రీనివాస్‌గౌడ్, కొత్త నర్సింహారెడ్డి, కర్రె అయిలయ్య, చిక్కిరి రవి, కంభంపాటి జయమ్మ, సామ బుచ్చిరెడ్డి, దోర్నాల గోపాల్, కట్టెకోల శ్రీహరి, కంభంపాటి సోమరాజు, బండ సాయి, నాతి స్వామి, నాతి మల్లికార్జున్‌ ఉన్నారు.   

మరిన్ని వార్తాలు..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top