ఆకుతో ఫేస్‌ మాస్క్‌ : వైరల్‌ ఫోటో

Tribal Wear Masks With Leaves Photo VIral In Social Media - Sakshi

సాక్షి, కొత్తగూడెం : అడవి బిడ్డలకు అక్కడ దొరికే అకులు అలమలే వారికి ఆహారము, వైద్యమూ. సరిగ్గా వైద్య సదుపాయంలేని ఆ కొండకోనల్లో దొరికే ప్రతి మొక్క వారికి ఓ​ మూలికే. చిన్న చిన్న అనారోగ్యాలకు గాయాలకు సైతం ఆకుపసర వైద్యంతోనే నెట్టుకొచ్చేస్తుంటారు. ప్రపంచమంతటా మానవాళిని కరోనా మహమ్మారి కలవరపెడుతున్న వేళ మాస్క్‌లనీ, శానిటైజర్లనీ, సామాజిక దూరమంటూ జాగ్రత్త పడతున్న తరుణమిది. ఈ నేపథ్యంలో కరోనా నుంచి తమను తాము కాపాడుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం గంగమ్మ కాలనీలో ఆకులను మాస్క్‌కు మార్చి ఓ తల్లీబిడ్డా ధరించారు. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ప్రముఖులు సైతం దీనిని నెట్టింట‌ షేర్‌ చేస్తున్నారు. (బళ్లారి టు భద్రాద్రి.. 637 కి.మీ నడకయాతన)

ఇక కరోనా సోకకుండా అడవుల్లో ఉండే గిరిజనులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆకులతో సొంతంగా మాస్క్‌లు తయారుచేసి ముఖాలకు ధరిస్తున్నారు. నాలుగు గంటలపాటు తాజాగా ఉండే ఈ ఆకుల మాస్కులు ధరించి గొత్తికోయలు రోజువారి పనులు చేసుకుంటున్నారు.  

– దశరథ్‌ రజువా, సాక్షి ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top