బళ్లారి టు భద్రాద్రి.. 637 కి.మీ నడకయాతన

637 Kilometers On Foot; Labourers Ballarii To Bhadradri - Sakshi

లాక్‌డౌన్‌తో వలస కార్మికులకు అవస్థలు తప్పడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాంతానికి చెందిన సుమారు 20 మంది కూలీలు కర్ణాట క రాష్ట్రం బల్లారిలో రోడ్డు నిర్మాణానికి ఉప యోగించే కంకరను కొట్టే పనులకు వెళ్లారు. లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పను లు లేక, రవాణా సదుపాయం లేక 637 కిలోమీటర్లు కాలి నడకన పాల్వంచకు బయలుదేరారు. ఆరు రోజుల పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రా లను దాటుకుని సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. రామవరం చెక్‌పోస్టు వద్ద వీరిని ఏఎస్సై రామకృష్ణ అడ్డుకుని వివరాలు సేకరించారు. ఏపీలో కరోనా టెస్టులు చేసిన రిపోర్టులను పోలీసులకు చూపించి తమ గోడు విన్నవించుకున్నారు. ఏఎస్సై.. వెంటనే ఆహార పదా ర్థాలు అందించి పాల్వంచకు పంపించే ఏర్పాట్లు చేశారు. లాక్‌డౌన్‌ కూలీల బతుకులను ఛిద్రం చేస్తుందనడానికి ఈ చిత్రాలే నిదర్శనం.
– దశరథ్‌ రజువా, సాక్షి ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top