స్కూలు ఆవరణలో కూలిన భారీ వృక్షం | tree collapsed in secunderabad Central College | Sakshi
Sakshi News home page

స్కూలు ఆవరణలో కూలిన భారీ వృక్షం

Apr 16 2016 4:58 PM | Updated on Sep 3 2017 10:04 PM

సికింద్రాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయం ఆవరణలోని ఓ పెద్ద చెట్టు శనివారం ఉదయం కూలిన ఘటనలో పెనుప్రమాదం తప్పింది.

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయం ఆవరణలోని ఓ పెద్ద చెట్టు శనివారం ఉదయం కూలిన ఘటనలో పెనుప్రమాదం తప్పింది. ఆవరణలోని ఒక పెద్ద చెట్టు ఆకస్మాత్తుగా కూలి అక్కడే ఉన్న కారుపై పడింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న వ్యక్తి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాగా, పాఠశాలకు సెలవు దినం కావటంతో అక్కడ విద్యార్థులెవరూ లేరు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయిందని స్కూల్ నిర్వాహకులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement