తెలంగాణలో రేపు సెలవు | tomorrow holiday in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రేపు సెలవు

Oct 19 2015 3:34 PM | Updated on Sep 3 2017 11:12 AM

తెలంగాణలో రేపు సెలవు

తెలంగాణలో రేపు సెలవు

తెలంగాణ అంతటా మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది.

హైదరాబాద్: తెలంగాణ అంతటా మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. సద్దుల బతుకమ్మ వేడుకల కోసం హైదరాబాద్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ పండుగ సందర్భంగా మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్బండ్ వరకు బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించనున్నారు.
 

ట్యాంక్బండ్ను అందంగా ముస్తాబుచేశారు. ఎల్ఈడీ లైట్లతో కూడిన బెలూన్లను ఏర్పాటుచేశారు. బతుకమ్మ వేడుకల చివరిలో పటాకులు పేల్చి సంబరాలు జరుపుతారు. ఈ సందర్భంగా ట్యాంక్బండ్ వద్ద ఏర్పాటుచేసిన బతుకమ్మ ఘాట్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాక్బండ్ వైపునకు వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement