బోరు బావిలో పడిన చిన్నారి | toddler falls into borewell in nalgonda district | Sakshi
Sakshi News home page

బోరు బావిలో పడిన చిన్నారి

Aug 2 2015 3:52 PM | Updated on Jul 11 2019 8:56 PM

నల్లగొండ జిల్లా పెద్దఉర మండలం పులిచెర్ల గ్రామంలో రెండున్నర సంవత్సరాల చిన్నారి ఆదివారం సాయంత్రం 3.25 గంటలకు బోరుబావిలో పడ్డాడు.

నల్లగొండ: నల్లగొండ జిల్లా పెద్దఉర మండలం పులిచెర్ల గ్రామంలో నాలుగు సంవత్సరాల బాలుడు ఆదివారం సాయంత్రం 3.25 గంటలకు బోరుబావిలో పడ్డాడు. ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న బోరు గుంతలో పడిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 20 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్టు, అతని అరుపులు వినిపిస్తున్నట్టు తల్లిదండ్రులు చెప్పారు.

విషయం అధికారులకు తెలియడంతో చిన్నారిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement