మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి భద్యతండాకు చెందిన ఓ బాలుడు శనివారం ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు.
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి భద్యతండాకు చెందిన ఓ బాలుడు శనివారం ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన మూడావత్ రాంజీ, మంగ్లి దంపతులు తమ కుమారుడు పులేందర్ అలియాస్ పుల్య(9)ను తీసుకుని శనివారం పొలం వద్దకు వెళ్లారు. తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమై ఉండగా పుల్య సమీపంలోని నీటి గుంత వద్ద ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు నీటి గుంతలోకి జారిపడిపోయాడు. కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతకగా గుంతలో శవమై కనిపించాడు. బాలుడు స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు.