నేడు ‘టెట్’ | today tet exam, deo dr.s. vijay kumar | Sakshi
Sakshi News home page

నేడు ‘టెట్’

Mar 16 2014 4:25 AM | Updated on Sep 2 2017 4:45 AM

టీచర్ ఎలిజిబులిటీ టెస్టు(టెట్) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈఓ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్ తెలిపారు.

విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : టీచర్ ఎలిజిబులిటీ టెస్టు(టెట్) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈఓ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం 9-30నుంచి మధ్యాహ్నం 12-30గంటల వరకు పేపర్-1 పరీక్ష 12 కేంద్రాల్లో, మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 పరీక్షను 94 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

 

ఈ మేరకు సీఎస్‌లు, డీఓలతో పా టు ఇన్విజిలేటర్ల నియామకం పూర్తయిందని, పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు స్క్వాడ్ బృందాలను కూడా నియమించామని డీఈఓ తెలిపారు. పీజీ హెచ్‌ఎంలను సీఎస్‌లుగా నియమించగా, మిగతా సిబ్బంది మొత్తం విద్యాశాఖేతర అధికారులు, ఉద్యోగులేనని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్దకు ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు నడపనుండగా, పరీక్ష సమయంలో కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ విధించి జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నట్లు డీఈఓ వివరించారు. ఈ సందర్భంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని, అర గంట ముందు కేంద్రంలోకి అనుమతిస్తామని ఆయ న తెలిపారు.

 

అభ్యర్థికి సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే కేంద్రంలోని నామినల్ రోల్, ఫొటో అటెండెన్సీ షీట్‌లో సరిచేయించుకోవాలని, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే వినియోగించాలని సూచించారు. పరీక్ష కేం ద్రంలోకి పేజర్, మొబైల్, క్యాలుక్యులేటర్లు తీసుకురావొద్దన్నారు. ప్రశ్నాపత్రం కోడ్‌ను ఓఎంఆర్ షీట్ సైడ్-2పై కేటాయించిన స్థలంలో రాయడమే కాకుండా సంబంధిత కోడ్‌ను షేడ్(బబుల్) చేయాలని, వైట్‌నర్ వాడొద్దని సూచించారు.

ఆన్‌లైన్ నుంచి హాల్‌టికెట్ డౌనలోడ్ చేసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే గత నెలలో తీసుకున్న హాల్ టికెట్‌తో కూడా అభ్యర్థులను అనుమతిస్తామని డీఈఓ వివరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement