చక్రంపేటలో పులి - భయంతో వణుకుతున్న జనం | Tiger wandering at Cakrampeta | Sakshi
Sakshi News home page

చక్రంపేటలో పులి - భయంతో వణుకుతున్న జనం

Oct 7 2015 4:07 PM | Updated on Oct 5 2018 8:51 PM

రంగారెడ్డి జిల్లా చక్రంపేట గ్రామ శివార్లలో పులి సంచారం జనాన్ని వణికిస్తోంది.

మొయిన్‌పేట మండలం చక్రంపేట గ్రామ శివారులోని పొలాల్లో బుధవారం మధ్యాహ్నం పులి సంచరిస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. వారు ఈ విషయాన్ని అధికారులకు తెలిపారు.

వెంటనే అప్రమత్తమైన అధికారులు పొలాలను పరిశీలించారు. పులి అడుగు జాడలు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రజలు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు  సూచించారు. మరో వైపు పులిని బంధించేందుకు అటవీ సిబ్బంది ఏర్పాట్లు చేస్తారని తెలియజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement