వందసార్లు తిరిగితే.. | Thummala Nageswara Rao on Progress of National Highway works | Sakshi
Sakshi News home page

వందసార్లు తిరిగితే..

Nov 2 2017 2:02 AM | Updated on Nov 2 2017 2:02 AM

Thummala Nageswara Rao on Progress of National Highway works - Sakshi

జాతీయ రహదారులకు అనుమతి విషయంలో కేంద్ర ప్రభు త్వం చుట్టూ తిరగాల్సి వస్తోందని, వందసార్లు తిరిగి వినతి పత్రాలిస్తే ఒక్క రోడ్డుకు అనుమతి ఇస్తోందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై టీఆర్‌ఎస్‌ సభ్యుల ప్రశ్నకు తుమ్మల సమాధానమిస్తూ రహదారులకు కేంద్రం అనుమతి ఇస్తోందే తప్ప డీపీఆర్, ఎస్టిమేట్లకు సంబంధించిన అంశాలను పెండింగ్‌లో పెడుతోందన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ సీఈ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు బదిలీ చేస్తే వేగంగా ఈ ప్రక్రియ నడుస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 2014కు ముందు 2,522 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండగా తెలంగాణ ప్రభుత్వం చొరవతో అవి 3,153 కిలోమీటర్లకు పెరిగాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement