పిడుగుపాటుకు ముగ్గురు మృతి | three members died with bombshell in medak distirict | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ముగ్గురు మృతి

Mar 6 2015 4:20 PM | Updated on Oct 8 2018 7:43 PM

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

మెదక్ : మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం జిల్లాలోని సదాశివపేట మండలం వేటూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చేతకూరి దానయ్య ఇంటిపై శుక్రవారం కురుస్తున్న వర్షాలకు పిడుగుపడింది. దీంతో దానయ్య(60) అతని అల్లుడు మల్లేషం(35), మనవడు అనిల్(10) లు మృతిచెందారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
(సదాశివపేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement