రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి | Three killed in road accident in nizamabad district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Oct 3 2014 5:11 PM | Updated on Aug 30 2018 3:56 PM

నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం అక్బర్నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం అక్బర్నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న వాహానాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. ఆ వాహనంలో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement