అత్తాపూర్‌లో దొంగల బీభత్సం | thives robbed in attapur | Sakshi
Sakshi News home page

అత్తాపూర్‌లో దొంగల బీభత్సం

Mar 26 2015 12:57 PM | Updated on Sep 2 2017 11:26 PM

రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్థరాత్రి మూడు చోట్ల దుండగులు చోరీలకు పాల్పడ్డారు.

హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్థరాత్రి మూడు చోట్ల దుండగులు చోరీలకు పాల్పడ్డారు. ఒక గ్యాస్ గోదాముతోపాటు రెండిళ్లలో చోరికి పాల్పడి రూ.8 లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు. చింతల్‌మెట్‌లో ఇండేన్‌గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ నాగేశ్వరరావు గదిలోని లాకర్ తెరిచి రూ.4 లక్షలు ఎత్తుకుపోయారు. అలాగే, హైదర్‌గూడ ప్రాంతం న్యూఫ్రెండ్స్ కాలనీలోని శివసాయి రెసిడెన్సీలో వెంకటనర్సింహారెడ్డి ప్లాట్‌లో దొంగలు ఆరు తులాల బంగారు నగలు, రూ.50 వేలు అపహరించుకుపోయారు. అక్కడే మూడో ఫ్లోర్‌లో ఉండే శ్రీనివాస్ ఇంట్లో 5 తులాల బంగారం, రూ.38 వేల నగదుతోపాటు రూ.50 వేల విలువైన రెండు వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఎత్తుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(అత్తాపూర్)

Advertisement
 
Advertisement
Advertisement