'గ్రామజ్యోతి'తో పైసా ఉపయోగం లేదు: ఎంపీ గుత్తా | there is no use with grama jyorhi schem, says mp gutta sukhender reddy | Sakshi
Sakshi News home page

'గ్రామజ్యోతి'తో పైసా ఉపయోగం లేదు: ఎంపీ గుత్తా

Aug 17 2015 4:45 PM | Updated on Aug 14 2018 10:54 AM

'గ్రామజ్యోతి'తో పైసా ఉపయోగం లేదు: ఎంపీ గుత్తా - Sakshi

'గ్రామజ్యోతి'తో పైసా ఉపయోగం లేదు: ఎంపీ గుత్తా

టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన గ్రామజ్యోతి పథకంతో గ్రామాలకు ఎలాంటి ఉపయోగం ఉండదని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

నల్లగొండ: టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన గ్రామజ్యోతి పథకంతో గ్రామాలకు ఎలాంటి ఉపయోగం ఉండదని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార ఆర్భాటానికే తప్ప ఈ పథకానికి పైసా విదిల్చేది ఉండదని విమర్శించారు.

సోమవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడిన గుత్తా.. గ్రామజ్యోతి పథకానికి సరైన ప్రణాళిక లేదన్నారు. పథకంలో ఎంపీటీసీ, జెడ్సీటీసీలను భాగస్వామ్యులు చేయకపోవడం తగదన్నారు. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం అందించే నిధులే తప్ప గ్రామజ్యోతి కోసం ప్రత్యేకంగా ఒక్క పైసా కేటాయించడంలేదని వివరించారు. గతంలో నిర్వహించిన సమగ్ర సర్వే, మన ఊరు- మన ప్రణాళికలు చెత్తబుట్టకే పరిమితమయ్యాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement