రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | The young man killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Mar 19 2017 12:07 PM | Updated on Aug 30 2018 4:10 PM

నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టింది.

హైదరాబాద్ : నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని బేగంబజార్‌కు చెందిన వికాస్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement