ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్పులను వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్పులను వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఎన్‌ఎస్‌యూ, బీసీ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. తహశీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.