పాముకాటుతో విద్యార్థి మృతి | the student died of snakebite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో విద్యార్థి మృతి

Mar 10 2016 11:24 AM | Updated on Oct 17 2018 6:06 PM

పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి పాము కాటు తో మృతి చెందాడు.

పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిని పాము కాటు వేసిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని భాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న అనిల్(5) అనే విద్యార్థి పాఠశాల ఆవరణలో ఆడుకుంటుండగా.. పాము కాటు వేసింది. ఇది గుర్తించిన ఉపాధ్యాయులు విద్యార్థిని హుటాహుటిన జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అయితే..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. అనిల్ మృతి చెందాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement