మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద పరవళ్లు తొక్కుతోంది.
రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 9.92 మీటర్ల నీటిమట్టం
రెండో ప్రమాద హెచ్చరిక జారీ
{పజలను అప్రమత్తం చేసిన అధికారులు
ఏటూరునాగారం :మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద పరవళ్లు తొక్కుతోంది. సోమవారం సాయంత్రం 9.92 మీటర్ల నీటి మట్టం నమోదు కావడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి వరదతో రామన్నగూడెం, గొంటైని పంట పొలాలు నీట మునిగాయి. మండల కేంద్రంలోని మానసపల్లి శివారులో 16 ఎకరాల్లో వరి నారుమడులు మునిగిపోయూరుు.
జలదిగ్బంధంలో మూడు గ్రామాలు..
మండలంలోని రాంనగర్, కోయగూడ ఎల్లాపురం, లంబాడీతండా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి, జీడివాగు పొంగి ప్రవహించడంతో ఆయా గ్రామాలకు వెళ్లే కాజ్‌వే పూర్తిగా నీట మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. రాంనగర్- రామన్నగూడెం గ్రామాల మధ్య లోలెవల్ కాజ్‌వేపై వరద ఉండడంతో మూడు రోజులుగా ఆయూ గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయారుు. దీంతో ఐటీడీఏ, రెవెన్యూ అధికారులు స్పందించి సోమవారం పడవలను ఏర్పాటు చేశారు. ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, ఆర్డీఓ మహేందర్‌జీ అధికారులతో కలిసి మానసపల్లి, రాంనగర్, రామన్నగూడెం ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇస్తూ లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించాలని తహశీల్దార్ నరేందర్, వీఆర్‌ఓలను ఆదేశించారు. వారి వెంట ఇరిగేషన్ అధికారులు, ఆర్‌ఐ సర్వర్‌పాషా, వీఆర్‌ఓలు ఖాసీం, నర్సయ్య, నర్సయ్య, రాములు, పుల్లయ్యతోపాటు సర్పంచ్ బొల్లె జ్యోతి, శ్రీను, మాజీ సర్పంచ్ గారె ఆనంద్, పీఏసీఎస్‌డెరైక్టర్ దొడ్డ కృష్ణ, ఎంపీటీసీ దొడ్డ పద్మ ఉన్నారు.