పోలీసుల అదుపులో అంతర్‌ రాష్ట్రదొంగల ముఠా? | the inter-state gang of thieves in Police control ? | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో అంతర్‌ రాష్ట్రదొంగల ముఠా?

Apr 1 2017 6:58 PM | Updated on Aug 28 2018 7:30 PM

కోదాడ పరిసర ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

కోదాడ: కోదాడ పరిసర ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను కోదాడ పట్టణ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వీరు కోదాడ మండల పరిధిలోని దోరకుంట గ్రామంలో షల్టర్‌ తీసుకున్నట్లు సమాచారం అందడంతో పట్టణ పోలీసులు అత్యంత రహస్యంగా అక్కడి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు సమాచారం.ముఠా సభ్యులను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించి  విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో వీరి నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement