అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య

Nov 22 2015 8:45 AM | Updated on Oct 1 2018 2:36 PM

నల్లగొండ జిల్లా వేములపల్లి మండం తోపుచర్ల గ్రామంలో ఓ రైతు అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నల్లగొండ జిల్లా వేములపల్లి మండం తోపుచర్ల గ్రామంలో ఓ రైతు అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వల్లపుదాసు శ్రీను (35) తనకున్న రెండెకరాలతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. అయితే, సాగు కోసం గతంలోను, ఇప్పుడు కలిపి మొత్తం రూ.2 లక్షల మేర అప్పులు చేశాడు. పంట దిగుబడి రాని పరిస్థితి కనిపిస్తుండడంతో అప్పులు తీర్చలేనమోనని దిగులుతో శనివారం అర్ధరాత్రి తన ఇంటివద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement