నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం స్టేజ్‌వద్ద ఓ యువకుడి దారుణ హత్య జరిగింది.
నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం స్టేజ్‌వద్ద ఓ యువకుడి దారుణ హత్య జరిగింది. గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చిన అనంతరం మృతదేహం పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో పాక్షికంగా కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు చౌటుప్పల్ మండలం తంగెడపల్లికి చెందిన శ్రీనివాస్(25)గా గుర్తించారు.