మార్చి 25 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ | tenth exams from march 25th | Sakshi
Sakshi News home page

మార్చి 25 నుంచి టెన్త్ ఎగ్జామ్స్

Dec 4 2014 12:30 AM | Updated on Sep 28 2018 4:43 PM

పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 25 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సంగారెడ్డి మున్సిపాలిటీ: పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 25 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూలు డెరైక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ విభాగం ఆదేశాల మేరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతి రోజు ఉదయం 9-30 నుంచి 12-15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 25న తెలుగు పేపర్-1, 26న పేపర్-2, 27న హిందీ, 30న ఇంగ్లీష్ పేపర్-1, 31న పేపర్-2,  ఏప్రిల్ 1న గణితం పేపర్-1, 2న పేపర్-2, 4న జనరల్ సైన్స్ పేపర్-1, 6న సైన్స్ పేపర్ -2, 7న సాంఘిక శాస్త్రం  పేపర్-1, 8న పేపర్-2, పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement