
సాక్షి, హైదరాబాద్: దేవాలయాల భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలను తమకే ఇవ్వా లని అర్చకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ప్రోత్సాహకం కూడా వారికే ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్‌ను కలిసి వారి సమస్యలను విన్నవించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల అర్చకుల పేర్ల పహాణీలో అనుభవదారు పేర్లు తొలగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.