సినీనటి తెలంగాణ శకుంతల ఇకలేరు

సినీనటి తెలంగాణ శకుంతల ఇకలేరు


హైదరాబాద్: సినీనటి తెలంగాణ శకుంతల (65) కన్నుమూశారు. హైదరాబాద్లోని కొంపల్లి ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆమె గుండెపోటుతో మృతిచెందారు.  70కి పైగా చిత్రాల్లో  శకుంతల నటించింది. ఆమె తొలి చిత్రం మాభూమి(1981)  సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. తెలంగాణ శకుంతలగా సుపరిచతమైన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అంతేకాక శకుంతల తెలంగాణ యాసను స్పష్టంగా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల ఆధారభిమానులను సంపాదించుకుంది. ఆమె చివరిచిత్రం పాండవులు పాండవులు తుమ్మెద(2014). మహరాష్ట్రలో పుట్టిన శకుంతలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తెలంగాణ శకుంతల తీసిన పలుచిత్రాల్లో నువ్వు-నేను, లక్ష్మీ చిత్రాలు ఆమె నటనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top