Telangana Sakuntala
-
యాక్టింగ్‌లో మేటి.. యాసలో ఒకటే!
వెబ్‌డెస్క్: ఏరంగంలోనైనా పురుషులతో సమానంగా మహిళలు రాణించాలంటే అదనపు నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాల్సిందే. అలా తమదైన సొంత ప్రతిభతో పురుషులకు ధీటుగా తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నవారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా సినీరంగంలో,అందులోనూ హాస్య పాత్రల్లో రాణించడమంటే కత్తిమీదే సామే. అలాంటి వారిలో అలనాటి సూర్యకాంతం, ఛాయాదేవి మొదలు, రమాప్రభ, శ్రీలక్ష్మి, 90ల దశకం నాటి తెలంగాణా శకుంతల, ఇంకా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న కోవై సరళ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా పరభాషా నటి అయినా తెలుగులో అద్భుతంగా రాణించిన కోవై సరళ, ‘తెలంగాణా’నే తన ఇంటి పేరుగా మార్చుకున్న తెలంగాణ శకుంతల మధ్య ఉన్న వివిధ సారూప్యతల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణా శకుంతల, కోవై సరళ ఇద్దరూ తెలుగు తమిళ సినిమాల్లో క్యారెక్టర్‌గా ఆర్టిస్టులుగా రాణించారు. తెలుగు సినీరంగంలో వీరిద్దరి మధ్యా ఉన్న సారూప్యత కేవలం హాస్యాన్ని పండించడం ఒక్కటే కాదు. అద్భుతమైన నటన, విలక్షణమైన భాషతో వీరు తెరపైగా కనిపించిగానే థియేటర్లలో నవ్వులు పూయాల్సిందే. సీటీలు మారు మోగాల్సిందే. నటనా శైలి, భాష, యాస, పంచ్ డైలాగులు వీరికి తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అపహాస్యం, అసభ్యత లేని కామెడీ వీరి సొంతం.కుటుంబంలో ఆడపిల్లగా కుటుంబ బాధ్యత తనపై వేసుకుని నిబద్దతతో కుటుంబాన్నిపైకి తీసుకు రావడం మరో సారూప్యత. కడియాల శంకుతల (తెలంగాణా శకుంతల) మహారాష్ట్రలో పుట్టి పెరిగిన కడియాల శంకుతల 250కి పైగా చిత్రాల్లో నటనతో అజరామరంగా నిలిచిపోయారు. ముఖ్యంగా టాలీవుడ్లో తెలంగాణ యాస, రాయలసీమ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒంటి కాలిపరుగుతో రంగస్థల నటిగా తన నటనాప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె ఆ తరువాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిరు. అది మొదలు ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఒకదశలో తన కోసమే పాత్రలను సృష్టించే స్థాయికి ఎదిగిన గొప్ప నటి ఆమె. రవీంద్ర భారతిలో ప్రదర్శించిన నాటకం ద్వారా నటన మొదలు పెట్టిన ఆమె చాలా నాటకాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఆ తరువాత. గౌతమ్ ఘోస్ దర్శకత్వం వహించిన 1979 నాటి చిత్రం ‘మా భూమి’ ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వు నేను’ ‘నీ తల్లి..ఇంకోపాలి నా ఇలాకలో..’ డైలాగ్‌తో పాపులర్ అయిన ఆమె ఆ తరువాత ఎన్నో పంచ్ డైలాగులతో ప్రేక్షకుల మెప్పుపొందారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ ‘ఒక్కడు’లోని ఆమె నటన, ఆమె పలికన తీరు, నోట్లో లావుపాటి చుట్టతో ఆమె ఆహార్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అంతేనా లక్ష్మి సినిమాలో, మరో హాస్యనటుడు వేణు మాధవ్‌తో కలిసి నటించిన కామెడీ సీన్ గుర్తొస్తే పగలబడి నవ్వాల్సిందే. ‘‘తమ్మీ పైసలు దెస్తివా..మరి ఏమే.. పోవే.. శక్కూ.. అంటివి గదరా’‘ లాంటి ఎన్నో విలక్షణ డైలాగులతో శకుంతల ఎంతో ప్రాచుర్యం పొందారు. పెళ్లాంతో పనేంటి సినిమాలో కొండవలసకు జోడిగా ఆమె అమాయకపు నటన, ఆ తరువాత చూపించిన నట విశ్వరూపం, ఒరిజినల్ కారెక్టర్‌ను ప్రదర్శించిన తీరు అద్భుతం. అలాగే దివంగత దర్శకుడు దాసరి నారాయణ దర్శకత్వంలోవచ్చిన చిత్రం ఒసేయ్ రాములమ్మతోపాటు, కొమురం భీం, ఎర్ర సైన్యం లాంటి చిత్రాలు ఆమె కరియర్లో భాగం. అంతేకాదు పురుషులతో పోటీ పడి మరీ విలనిజాన్ని పండించిన ఘనత శకుంతల సొంతం. కుక్క సినిమాలో నటనకు నంది అవార్డును సొంతం చేసుకున్నారు. భూదేవికి ఉన్నంత సహనం, ఓర్పు, కష్టపడే మనస్తత్వంతోనే మహిళలు రాణిస్తారని నమ్మి ఆచరించిన ధీర మహిళ శకుంతల. రవి తేజ నటించిన వీడే మూవీలో ఆమె ఒక పాట పాడటం విశేషం. ‘‘భయం అనేదే నాకు తెలియదు..అమ్మకు నేనే అబ్బాయిని. నన్ను మగరాయుడిలా పెంచారు..నలుగురి అక్క చెలెళ్లకు నేను అన్న..నేనే తమ్ముడిని. డేరింగ్ అండ్ డేషింగ్ మహిళను’’ అని స్వయంగా శకుంతలగారే చెప్పుకున్నారు. తండ్రి చనిపోవడంతో నటననే వృత్తిగా ఎంచుకుని కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు. అక్క, చెల్లెళ్లకు పెళ్లి చేసిన తరువాత మాత్రమే ఆమె పెళ్లి చేసుకున్నారు. రెండుసార్లు భయంకరమైన యాక్సిడెంట్లు, రెండుకాళ్లు విరిగిపోయినా మృత్యుంజయురాలై, ఫీనిక్స్ పక్షిలా పడిలేచిన కెరటం శకుంతల. కానీ 2014, జూన్ 14న తీవ్ర గుండెపోటుతో కన్నుమూయడం విషాదం. కోవై సరళ 1962 ఏప్రిల్ 7న తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జన్మించిన కోవై సరళ తమిళం తెలుగు భాషల్లో విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. రెంటిలోనూ ఇప్పటి దాకా సుమారు 750 సినిమాల్లో నటించారు. కామెడీనీ పండించడంలో ఈమెకు ఈమే సాటి. ముఖ్యంగా కమల్ హాసన్‌కు జోడీగా ‘సతీ లీలావతి’, స్టైలిష్‌స్టార్ అర్జున్ నటించిన దేశముదురుమూవీలో కోవై సరళ నటనను ఎలా మర్చిపోతాం. అంతేకాదు బ్రహ్మానందానికి తోడుగా తిరుమల తిరుపతి వెంకటేశా, 2002లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన సినిమా సందడే సందడి మూవీలో ఆమె చేసిన కామెడీ హైలెట్‌గా చెప్పొచ్చు. అలాగే లారెన్స్ మూవీ కాంచనలో కోవై సరళ అమాయక నటనకు జేజేలు చెప్పాల్సిందే. నాగార్జున నుంచి మొదలు ఈ తరం యంగ్ హీరోలు అందరి సినిమాల్లోను ఆమె నటించారు. ముఖ్యంగా కిక్-2 , గ్రీకు వీరుడు, హీరో, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, ఎలా చెప్పను, శ్రీరామచంద్రులు, ఎంత బావుందో!, ఫూల్స్ , అక్కా బావెక్కడ సినిమాల్లోని పాత్రలతో తనదైన శైలితో ఆకట్టుకున్నారు. పదినేళ్ల వయసులోనే కేఆర్ విజయ సరసన వెల్లి రథం అనే తమిళ సినిమాలో నటించారు. ముంధనై ముడిచ్చు అనే సినిమాలో 32 ఏళ్ళ గర్భిణిగాను, మరో రెండు సంవత్సరాల తరువాత చిన్నవీడు అనే సినిమాలో భాగ్యరాజా పాత్రకు తల్లిగా 65 ఏళ్ళ మహిళ పాత్రలో నటించిన మెప్పించిన ఘనత ఆమె సొంతం. కోవై సరళ కుటుంబ బాధ్యతల నిమిత్తం అవివాహితగానే మిగిలిపోయారు. నలుగురు అక్కచెల్లెళ్లున్న కుటుంబంలో పెద్ద కుమార్తె సరళ. వారి చదువు సంధ్యా వివాహాల సందడిలో పడి పెళ్లి అన్న మాటనే మర్చిపోయారామె. తనకు ఒంటరిగా ఉండడం ఇష్టమని, అందుకే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని ఒక సందర్భంగా ఆమె చెప్పుకున్నారు. ఓరి నీప్రేమ బంగారం కానూ (2003) సినిమాకు ఉత్తమ హాస్యనటి నంది పురస్కారాన్ని, తమిళనాడు ప్రభుత్వం నుంచి మూడుసార్లు ఉత్తమ హాస్యనటి అవార్డును సొంతం చేసుకున్నారు. తరతరాలకి ఎవర్గ్రీన్ కామెడీ క్వీన్ కోవై సరళ అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
'ఎన్టీఆర్ నన్ను పిలిచి నువ్వు చేస్తావా? అన్నారు'
కాకినాడ (కొత్తపేట) : తెలంగాణా శకుంతలగా అమ్మ, అక్క, లేడీ విలన్ క్యారెక్టర్లలో రాణించాలన్నదే తన ఆకాంక్ష అని వర్ధమాన క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాసరి పద్మరేఖ తెలిపారు. రాధాగోపాలం, రాములమ్మ తదితర సీరియల్స్, పుష్కర, టైటానిక్ తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన పద్మరేఖ కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నాదేశం’ పాట చిత్రీకరణ హైదరాబాద్ గోల్కొండ కోటలో జరుగుతుండగా.. అందులో ఒక డ్యాన్సర్ సరిగా చేయకపోతే ఎన్టీఆర్ నన్ను పిలిచి నువ్వు చేస్తావా? అన్నారు. చేస్తానని చెప్పాను. అలా సినిమాల్లో తొలి అవకాశం దక్కింది. సినీ రైటర్ చంద్రబోస్ భార్య, డ్యాన్సర్ సుచిత్రమాస్టర్ నా గురువు. ఆమె వద్ద వెస్ట్రన్ డ్యాన్స్, విజయశాంతి ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందాను. చేసిన సినిమాలు.. నూతన నటీనటులతో తీసిన ‘మజిలీ’ చిత్రంలో తల్లి పాత్ర, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ హీరోగా ‘టైటానిక్’ అంతర్వేది టు అమలాపురం అనే ఉప శీర్షిక పేరుతో తీసిన చిత్రంలో థర్టీయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ వైఫ్ క్యారెక్టర్, ఏఎన్ఆర్ మనుమడు సుశాంత్ హీరోగా ‘ఆటాడుకుందాం రా!’ సినిమాలో హీరోయిన్ అవకాశం కోసం డెరైక్టర్‌ను పాకులాడే పాత్ర, పుష్కర సినిమాలో హీరోయిన్ కాజల్‌కు తల్లిగా, భానుచందర్‌కు భార్యగా నటించా. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ సినిమాలోని ప్రకాష్‌రాజ్ చెల్లెలుగా నటిస్తున్నాను. నటించిన సీరియల్స్.. రాములమ్మలో తల్లి పాత్ర, రాధాగోపాలంలో హీరోయిన్ రాధ పిన్ని (విలన్ షేడ్)పాత్ర పోషిస్తున్నాను. -
తెలంగాణ శకుంతలకు సినీ ప్రముఖుల నివాళి
-
ఆమె గళానికి విజిల్స్ వినిపించాల్సిందే!
మహారాష్ట్రలో పుట్టారు. ఇక్కడ భాషను, యాసను సొంతం చేసుకున్నారు. ఆమె తెలంగాణ యాసలో డైలాగ్ అందుకుంటే థియోటర్స్ లో విజిల్స్ వినిపించవలసిందే. అదీ ఆమె ప్రత్యేకత. ఆ గళంలో, ఆ పలికే తీరులో అంతటి పవర్ ఉంది. తెలంగాణని ఆమె ఇంటి పేరు చేసుకున్నారు. ఏ పాత్ర చేసినా అందులో ఇమిడిపోతారు. అటువంటి మహానటి తెలంగాణ శకుంతల(65) శాశ్వతంగా వెండితరకు దూరమైపోయారు. కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. అక్కగా, అమ్మగా, బామ్మగా... శకుంతల నటన మరచిపోవటం ఎవరితరం కాదు. డైలాగులతో సంచలనం సృష్టించారు. దుమ్మురేపారు. ప్రతి పాత్రలో మెరుపులు మెరిపించారు. నటించిన ప్రతి పాత్రలో ఆమె ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అక్కా అని పిలిచినా శెక్కూ అన్నా .. శకుంతలక్క ఇక పలకదు. ఆమె లేకపొయినా వెండితెరపై మాత్రం ఆమె పోషించిన పాత్రలు సజీవంగానే ఉన్నాయి. ఆమె కంచుకంఠం ప్రేక్షకుల హృదయాల్లో ధ్వనిస్తూనే ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల మదిలో శకుంతల వేసిన ముద్ర చెరిగిపోదు. ఆమె వెదజల్లిన నవ్వుల పువ్వులు వసివాడిపోవు. 1979లో మాభూమి సినిమాతో శకుంతల తెలుగు తెరకు పరిచయమయ్యారు. కానీ బ్రేక్ రావటం కోసం మాత్రం చాలా సమయం ఎదురు చూశారు. తేజ డైరెక్షన్లో వచ్చిన 'నువ్వే నువ్వే' తో విపరీతమైన క్రేజ్ సంపాదించారు. తెలంగాణ యాసలో శకుంతల చెప్పిన డైలాగ్స్ ఆటంబాంబుల్లా పేలాయి. తెలంగాణ భాషలోని పవర్ ఆమె గొంతులో అధ్బుతంగా వినిపించింది. శకుంతల తెలుగు , హిందీ, తమిల్, బోజ్‌పూరి వివిధ భాషలలో దాదాపు 250 చిత్రాలలో నటించారు. ఆమె చివరి సారిగా నటించిన రాజ్యాధికారం చిత్రం విడుదల కావలసి ఉంది. మహరాష్ట్రలో పుట్టిన శకుంతలకు ఇద్దరు పిల్లలు. ఒక కుమారుడు, ఒక కూతురు. నువ్వు-నేను, లక్ష్మీ చిత్రాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. మా భూమి, రంగులకల, నువ్వునేను సినిమాల ద్వారా ఆమె నంది అవార్డులు అందుకున్నారు. తన కెరీర్లో శకుంతల ఎన్నో విభిన్నమైక పాత్రలు పోషించారు. తెలంగాణ యాసతో మాట్లాడటం ఆమె ప్రత్యేకత అయినప్పటికీ అన్ని ప్రాంతాల యాసల్నీ ఆమె అవలీలగా పలికారు. అందరినీ మెప్పించారు. ఆమో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. ఎంతటి నటుడైనా ఆమె ముందు ఆగరు. గుణశేఖర్ దర్శకత్వంలో ఒక్కడు చిత్రంలో ఆమె నటించిన పాత్రే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తిరుగులేని డైలాగ్స్‌తో ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా, తన నటనతో కడుపుబ్బా నవ్వించటం శకుంతలకే చెల్లింది. కొన్ని పాత్రలతో అందరినీ అదరగొట్టినప్పటికీ, అవేరకమైన మూస పాత్రలతో విసిగించకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త అనుభూతినిచ్చారు. హాస్యంలో కూడా ఆమె తన ప్రత్యేకతను నిలుపుకున్నారు. లక్ష్మీ చిత్రంలో శకుంతల - వేణుమాధవ్ నటించిన సన్నివేశాలు కడుపుబ్బనవ్విస్తాయి. అందరినీ భయపెట్టే శకుంతల భయపడే పాత్ర కూడా పోషించి మెప్పించారు. ఆదివారం ఆడవాళ్లకు సెలవు సినిమాలో ఆమె ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు. -
తెలంగాణ శకుంతలకు ట్విట్టర్లో ఘనంగా నివాళులు
మహారాష్ట్రలో పుట్టి, టాలీవుడ్ తెరమీద విభిన్న పాత్రలు పోషించి అశేషాంధ్రుల ఆదరాభిమానాలు చూరగొన్న తెలంగాణ శకుంతలకు పలువురు నటీ నటులు, టాలీవుడ్ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. శకుంతల ఇప్పటివరకు 250 సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, భోజ్‌పురి లాంటి భాషల్లో ఆమె తన నటనా ప్రావీణ్యం ప్రదర్శించారు. మా భూమి, రంగులకల, నువ్వునేను చిత్రాల్లో ఆమె నటనకు నంది అవార్డులు కూడా వచ్చాయి. కాగా, మధ్యాహ్నం రెండు గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్లో తెలంగాణ శకుంతల పార్థివ దేహాన్ని ఉంచి, ఆ తర్వాత అల్వాల్‌లోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. శకుంతలకు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించినవారిలో నటీనటులు సమంత, సిద్దార్థ, లక్ష్మి మంచు, నిఖిల్, ప్రణీత, సందీప్ కిషన్ తదితరులున్నారు. Saddened by the demise of Telangana Shakuntala ma'am.Honour to have worked with her.May her soul rest in peace . — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) June 14, 2014 RIP Telangana Shakuntala garu. Vibrant, warm, and such a talented artiste. Gone too soon. Strength to the family. — Siddharth (@Actor_Siddharth) June 14, 2014 It is heartbreaking that another great actor passes.. RIP #telanga shakuntala. Her theatre performances were legendary. More than 1000 plays — Lakshmi Manchu (@LakshmiManchu) June 14, 2014 Tragic to know Telugu Film Industry has lost a Superb Actress like Telangana Shakuntala garu.. She has entertained us for so many yrs.. RiP — Nikhil Siddhartha (@actor_Nikhil) June 14, 2014 Sad to hear of the sudden demise of Telangana Shakuntala garu..may her soul rest in peace .. — Pranitha Subhash (@pranitasubhash) June 14, 2014 Shocked to here of Telangana Shakuntala garu's demise..dint get to work with her but loved her performances..RIP — Sundeep Kishan (@sundeepkishan) June 14, 2014 -
గుండెపోటుతో తెలంగాణ శకుంతల(65) మృతి
-
సినీనటి తెలంగాణ శకుంతల ఇకలేరు
హైదరాబాద్: సినీనటి తెలంగాణ శకుంతల (65) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కొంపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె గుండెపోటుతో మృతిచెందారు. 70కి పైగా చిత్రాల్లో శకుంతల నటించింది. ఆమె తొలి చిత్రం మాభూమి(1981) సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. తెలంగాణ శకుంతలగా సుపరిచతమైన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాక శకుంతల తెలంగాణ యాసను స్పష్టంగా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల ఆధారభిమానులను సంపాదించుకుంది. ఆమె చివరిచిత్రం పాండవులు పాండవులు తుమ్మెద(2014). మహరాష్ట్రలో పుట్టిన శకుంతలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తెలంగాణ శకుంతల తీసిన పలుచిత్రాల్లో నువ్వు-నేను, లక్ష్మీ చిత్రాలు ఆమె నటనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.